-ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు
-విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం కడియం
RESULTS.NAMASTHETELANGAANA.COM
,
NTNIPUNA.COM ,
HTTP://RESULTS.CGG.GOV.IN,
HTTP://EXAMRESULTS.TS.NIC.IN లో ఫలితాలు చూడొచ్చు.
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విడుదల చేయనున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి ఏ అశోక్ గురువారం తెలిపారు. మార్కులు/ గ్రేడింగ్ రూపంలో ఫలితాలు విడుదల చేయనున్నామని ఆయన చెప్పారు. విద్యార్థుల సౌకర్యార్థం పలు వెబ్‌సైట్‌లలో ఫలితాలు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ-సేవా లేదా టీఎస్/ ఏపీ ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చునని తెలిపారు.
WWW.BIE.TELANGANA.CGG.GOV.IN అనే వెబ్‌సైట్‌లో ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు ఫలితాలు తెలుసుకోవచ్చునని చెప్పారు. అలాగే, ఇంటర్ ఫలితాలు
RESULTS.NAMASTHETELANGAANA.COM,
NTNIPUNA.COM,
RESULTS.CGG.GOV.IN,
EXAMRESULTS.TS.NIC.IN తోపాటు మరో 35 వెబ్‌సైట్లలో ఇంటర్మీడియట్ ఫలితాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మార్చి 2 నుంచి 21 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
No comments:
Post a Comment