నవ భారతాన్ని ఆవిష్కరించేందుకు నాలుగున్నరేండ్లుగా కేంద్రం కృషి చేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు సర్కారు పాటుపడిందని ప్రశంసలు కురిపించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గురువారం ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. జవాబుదారీతనం, పారదర్శకతను పెంచి.. అవినీతిరహిత పాలన దిశగా సర్కారు ముందడుగు వేసిందని కితాబునిచ్చారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య భద్రతా పథకమైన ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశంలో 50 కోట్ల మందికి ఆరోగ్య పరిరక్షణ కల్పించామని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నదని కొనియాడారు.
కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. పీయూష్ గోయల్ ఆఫీసు ప్రాంగణంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, నిపుణులతో కలిసి అభివాదం చేశారు. పీయూష్ గోయల్ ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ ను Read More
No comments:
Post a Comment