Tuesday, 25 December 2018

మహీ మళ్లొచ్చాడు..

అనుభవానికే పెద్దపీట వేసింది. రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలకు పోకుండా జట్లను ఎంపిక చేసింది. సోమవారం సమావేశమైన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, టీ20 సిరీస్‌కు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. ఇటీవలి ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ధోనీని తప్పించిన సెలెక్షన్ కమిటీ తిరిగి జట్టులో చోటు కల్పించింది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మందితో కూడిన జట్టులోకి మహీ వచ్చేశాడు. ఇక ఆసీస్, కివీస్‌తో వన్డే సిరీస్‌ల నుంచి యువ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను సెలెక్టర్లు తప్పించారు. మేలో మొదలయ్యే ప్రపంచకప్ నాటికి వన్డేలు తక్కువ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జట్టుపై ఓ అంచనాకు వచ్చిన సెలెక్టర్లు మహీని తిరిగి టీ20లకు ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. తెలుగు క్రికెటర్... ..READMORE

No comments:

Post a Comment