నాగార్జునసాగర్ నీటి విడుదల
విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అరాచకానికి దిగింది. శుక్రవారం
కుడికాల్వ నీటి విడుదలకు ఏకపక్షంగా ఉత్తర్వులు జారీచేయడమే కాకుండా.. వాటిని
బలవంతంగానైనా అమలు చేయాలంటూ అధికార, పోలీసు యంత్రాంగాలను ఏకంగా యుద్ధానికే
పంపించింది. చివరకు హెడ్ రెగ్యులేటరీ కార్యాలయంలోకి దూసుకువెళ్లేందుకు
సైతం ఏపీ అధికారులు ప్రయత్నించారు. ఏపీ అధికారులు, పోలీసులను తెలంగాణ
అధికారులు, పోలీసులు అడ్డుకోవడంతో డ్యాం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
నెలకొన్నాయి. ఏపీ అధికారుల కవ్వింపు చర్యలతో ఒక దశలో ఉభయపక్షాల మధ్య...Read More