Friday, 22 February 2019

ఎన్టీఆర్ మహానాయకుడు రివ్యూ


సంక్రాంతి కానుకగా గత నెలలో విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ సినీ ప్రయాణం ఎలాంటి మలుపులు లేకుండా సాఫీగా సాగడం, ఆసక్తికర అంశాలకు కథలో చోటివ్వకపోవడంతో ప్రేక్షకుల్ని ఈ చిత్రం మెప్పించలేకపోయింది. దాంతో రెండో భాగమైన ఎన్టీఆర్ మహానాయకుడును ఎలాంటి ప్రచారం, ఆర్భాటాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు చిత్రబృందం. ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఎన్నో ఎత్తుపల్లాల మధ్య సాగింది. అడుగడుగునా కుట్రలు, సవాళ్లు ఎదుర్కొన్నారు.
ముఖ్యంగా లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించిన అనంతరం రాజకీయపరంగా, వ్యక్తిగతంగా ఎన్టీఆర్‌కు ఎదురైన పరిణామాలతో పాటు వైస్రాయ్ ఘటన లాంటి అంశాలు సినిమాలో ఉంటాయా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది? సినిమాలో తనను విలన్‌గా చూపిస్తే సహించేది లేదంటూ నాదెండ్ల భాస్కర్‌రావు చిత్రబృందాన్ని హెచ్చరించడంతో ఈ సినిమాలో చర్చించే అంశాలేమిటో అనే ఆసక్తి తెలుగు ప్రేక్షకుల్లో నెలకొంది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రంలో వాస్తవాల్నిచూపించారా? చరిత్రను వక్రీకరించారా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్పిందే..  =====> Readmore Review

Tuesday, 5 February 2019

Telangana Tourist Places | Telangana Waterfalls | Kuntala waterfalls | Bogatha waterfalls



IF You are  a nature lover , #Telangana  State is home destination to many   beautiful and attractive waterfall  . visit  these in the right season, you can find here     best  #waterfalls  details and  information about   telangana waterfalls,  #telangana tourism  #telangaanam 

Friday, 1 February 2019

ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్న పీయూష్ గోయల్


piyush goyal arrives at ministry of finance office

కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. పీయూష్ గోయల్ ఆఫీసు ప్రాంగణంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, నిపుణులతో కలిసి అభివాదం చేశారు. పీయూష్ గోయల్ ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు బడ్జెట్ ప్రతులు కూడా పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకున్నాయి. కట్టుదిట్టమైన భద్రతల మధ్య బడ్జెట్ ప్రతులను పార్లమెంట్ కు Read More

ప్రజల ఆశలు, ఆకాంక్షల్ని నెరవేర్చాం.. ఇది నవభారతం


president-ramnath-kovind-address-to-the-members-of-both-the-houses-of-parliamen

నవ భారతాన్ని ఆవిష్కరించేందుకు నాలుగున్నరేండ్లుగా కేంద్రం కృషి చేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు సర్కారు పాటుపడిందని ప్రశంసలు కురిపించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గురువారం ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. జవాబుదారీతనం, పారదర్శకతను పెంచి.. అవినీతిరహిత పాలన దిశగా సర్కారు ముందడుగు వేసిందని కితాబునిచ్చారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య భద్రతా పథకమైన ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశంలో 50 కోట్ల మందికి ఆరోగ్య పరిరక్షణ కల్పించామని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నదని కొనియాడారు.

 కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. పీయూష్ గోయల్ ఆఫీసు ప్రాంగణంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, నిపుణులతో కలిసి అభివాదం చేశారు. పీయూష్ గోయల్ ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ ను Read More

Thursday, 31 January 2019

మోదీ నా కన్నా జూనియర్.. అయినా సర్ అని పిలిచాను!

 
Called PM Modi 'sir' to satisfy his ego Chandrababu Naidu

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా మరోసారి విమర్శలు గుప్పించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మోదీ రాజకీయాల్లో తనకన్నా జూనియర్ అయినా కూడా తాను సర్ అని పిలిచానని, కేవలం ఆయన అహాన్ని సంతృప్తి పరచడానికే తానిలా చేశానని బాబు అన్నారు. అఖిలపక్ష సమావేశంలో భాగంగా బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను కూడా నేను మిస్టర్ క్లింటన.. Read More

అమెజాన్‌ను ముంచిన యువకుడు అరెస్ట్‌


Man Arrested For Allegedly Duping Amazon Of Rs 30 Lakh In Indore

ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ను ఓ యువకుడు భారీగా మోసం చేశాడు. ఖరీదైన వస్తువులను ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసి రూ. 30 లక్షల మేర మోసం చేసినట్లు తేలింది. ఇండోర్‌కు చెందిన మహ్మద్‌ మహువాలా(27) ఫేక్‌ ఈమెయిల్‌ అకౌంట్స్‌, ఫోన్‌ నంబర్లతో పలు అకౌంట్లను క్రియేట్‌ చేసి ఖరీదైన గ్యాడ్జెట్స్‌, మొబైల్‌ ఫోన్స్‌ను కొనుగోలు చేశాడు. ఆ వస్తువులు తన వద్దకు వచ్చాక వాటిని తీసేసుకొని.. Read More

హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌లో 300 పైగా స్టాళ్లు అగ్నికి ఆహుతి



హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ఎగ్జిబిషన్ (నుమాయిష్)లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి 8.30 గంటలకు మొదలైన అగ్నికీలలు.. పదిన్నరవరకు కొనసాగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 200 స్టాళ్లు ఆహుతయ్యాయి. కోట్ల రూపాయల్లో ఆస్తినష్టం సంభవించింది. అగ్నిమాపకశాఖ, జీహెచ్‌ఎంసీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు సకాలంలో స్పందించి, పెను ముప్పును తప్పించాయి. నింగికి ఎగసిపడుతున్న మంటలను 20కిపైగా ఫైరింజన్లు శ్రమించి అర్పివేశాయి. దాదాపు 60 వాటర్‌ట్యాంకర్లు ఫైరింజన్లకు ఎప్పటికప్పుడు నీటిని సరఫరాచేశాయి. అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం, సందర్శకులను పోలీసులు సురక్షితంగా బయటకు పంపించడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే.. పొగ కారణంగా ఏడుగురు ఊపిరి ఆడక ఇబ్బందికి గురయ్యారు. వారిలో ముగ్గురిని నాంపల్లి కేర్ దవాఖానకు తరలించారని సమాచారం =====>  Readmore