Thursday, 31 January 2019

హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌లో 300 పైగా స్టాళ్లు అగ్నికి ఆహుతి



హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ఎగ్జిబిషన్ (నుమాయిష్)లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి 8.30 గంటలకు మొదలైన అగ్నికీలలు.. పదిన్నరవరకు కొనసాగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 200 స్టాళ్లు ఆహుతయ్యాయి. కోట్ల రూపాయల్లో ఆస్తినష్టం సంభవించింది. అగ్నిమాపకశాఖ, జీహెచ్‌ఎంసీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు సకాలంలో స్పందించి, పెను ముప్పును తప్పించాయి. నింగికి ఎగసిపడుతున్న మంటలను 20కిపైగా ఫైరింజన్లు శ్రమించి అర్పివేశాయి. దాదాపు 60 వాటర్‌ట్యాంకర్లు ఫైరింజన్లకు ఎప్పటికప్పుడు నీటిని సరఫరాచేశాయి. అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం, సందర్శకులను పోలీసులు సురక్షితంగా బయటకు పంపించడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే.. పొగ కారణంగా ఏడుగురు ఊపిరి ఆడక ఇబ్బందికి గురయ్యారు. వారిలో ముగ్గురిని నాంపల్లి కేర్ దవాఖానకు తరలించారని సమాచారం =====>  Readmore

No comments:

Post a Comment