కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు తన మిషన్ అని
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీనిపై నిర్మాణాత్మక
ప్రణాళికతో త్వరలో ప్రజల ముందుకు వస్తామని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్‌పై తమ
ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. రాజకీయాల్లో గుణాత్మక మార్పునకు
దేశవ్యాప్తంగా ప్రాంతీయపార్టీలన్నీ ఏకంకావాల్సిన అవసరముందన్న కేసీఆర్..
త్వరలోనే శుభవార్త వింటారని తెలిపారు. ఒడిశా పర్యటన ముగించుకుని సోమవారం
సాయంత్రం కోల్‌కతాలోని పశ్చిమబెంగాల్ ... Readmore
Tuesday, 25 December 2018
మహీ మళ్లొచ్చాడు..
అనుభవానికే పెద్దపీట వేసింది. రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలకు పోకుండా జట్లను ఎంపిక చేసింది. సోమవారం సమావేశమైన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, టీ20 సిరీస్‌కు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. ఇటీవలి ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ధోనీని తప్పించిన సెలెక్షన్ కమిటీ తిరిగి జట్టులో చోటు కల్పించింది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మందితో కూడిన జట్టులోకి మహీ వచ్చేశాడు. ఇక ఆసీస్, కివీస్‌తో వన్డే సిరీస్‌ల నుంచి యువ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను సెలెక్టర్లు తప్పించారు. మేలో మొదలయ్యే ప్రపంచకప్ నాటికి వన్డేలు తక్కువ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జట్టుపై ఓ అంచనాకు వచ్చిన సెలెక్టర్లు మహీని తిరిగి టీ20లకు ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. తెలుగు క్రికెటర్... ..READMORE
Saturday, 19 May 2018
మధ్యాహ్నం ఒంటి గంటకు ఎంసెట్ ఫలితాలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకోసం ఈ నెల రెండు నుంచి ఏడు వరకు నిర్వహించిన ఆన్‌లైన్ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేస్తారు. మెడికల్ విభాగంలో 63,653 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా 58,744 మంది, ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగంలో 1,26,547 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా 1,19,270 మంది ఎంసెట్‌కు..
Tuesday, 24 April 2018
ఈ నెల 27న పదో తరగతి ఫలితాలు.. వీటిలో చూడొచ్చు!
హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చే శుక్రవారం వెల్లడికానున్నాయి. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను మార్కులు కాకుండా గ్రేడింగ్‌లో మాత్రమే విడుదల చేయనున్నారు. పలు వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలను విద్యార్థులు తెలుసుకోవచ్చని ఎస్సెస్సీ బోర్డు అధికారులు మంగళవారం తెలిపారు.
TS SSC Results 2018 telangana 10th Class
Thursday, 12 April 2018
రేపు ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. రేపు ఉదయం 9.30 గంటలకు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను అధికారులు రేపు ప్రకటించనున్నారు.
Subscribe to:
Comments (Atom)