Tuesday, 25 December 2018

మహీ మళ్లొచ్చాడు..

అనుభవానికే పెద్దపీట వేసింది. రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలకు పోకుండా జట్లను ఎంపిక చేసింది. సోమవారం సమావేశమైన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, టీ20 సిరీస్‌కు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. ఇటీవలి ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ధోనీని తప్పించిన సెలెక్షన్ కమిటీ తిరిగి జట్టులో చోటు కల్పించింది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మందితో కూడిన జట్టులోకి మహీ వచ్చేశాడు. ఇక ఆసీస్, కివీస్‌తో వన్డే సిరీస్‌ల నుంచి యువ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను సెలెక్టర్లు తప్పించారు. మేలో మొదలయ్యే ప్రపంచకప్ నాటికి వన్డేలు తక్కువ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జట్టుపై ఓ అంచనాకు వచ్చిన సెలెక్టర్లు మహీని తిరిగి టీ20లకు ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. తెలుగు క్రికెటర్... ..READMORE

Saturday, 19 May 2018

మధ్యాహ్నం ఒంటి గంటకు ఎంసెట్ ఫలితాలు

ts-eamcet-reults-2018


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకోసం ఈ నెల రెండు నుంచి ఏడు వరకు నిర్వహించిన ఆన్‌లైన్ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేస్తారు. మెడికల్ విభాగంలో 63,653 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా 58,744 మంది, ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగంలో 1,26,547 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా 1,19,270 మంది ఎంసెట్‌కు..

Tuesday, 24 April 2018

ఈ నెల 27న పదో తరగతి ఫలితాలు.. వీటిలో చూడొచ్చు!

ts-SSC-Results-2018

హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చే శుక్రవారం వెల్లడికానున్నాయి. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తార‌ని అధికారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఫలితాలను మార్కులు కాకుండా గ్రేడింగ్‌లో మాత్రమే విడుదల చేయనున్నారు. పలు వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలను విద్యార్థులు తెలుసుకోవచ్చని ఎస్సెస్సీ బోర్డు అధికారులు మంగళవారం తెలిపారు. 

TS SSC Results 2018 telangana 10th Class 

Thursday, 12 April 2018

రేపు ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల

inter-results-2018


హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. రేపు ఉదయం 9.30 గంటలకు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను అధికారులు రేపు ప్రకటించనున్నారు.

Friday, 9 June 2017

ఉదయం 11 గంటలకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు

inter-results-2017

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదలకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మే 15 నుంచి 22 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను ఇంటర్మీడియట్  Read More
For TS Intermediate Supplementary Exam Results 2017:   www.ntnews.com

Thursday, 23 June 2016

TS ADV.SUPPLEMENTARY INTERMEDIATE RESULTS 2016

 Inter Advanced Supplementary Results

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం మధ్యాహ్నం 3గంటలకు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య విడుదల చేస్తారని ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఏ అశోక్ తెలిపారు. ఈ పరీక్షలకు దాదాపు 3లక్షలమంది విద్యార్థులు హాజరయ్యారన్నారు వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి

 Click here for Inter Supplementary Results 

 Click here for : ntnipuna.com

Friday, 22 April 2016

నేడు ఇంటర్ ఫలితాలు విడుదల

-ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు 
-విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం కడియం
RESULTS.NAMASTHETELANGAANA.COM , NTNIPUNA.COM , HTTP://RESULTS.CGG.GOV.IN, HTTP://EXAMRESULTS.TS.NIC.IN లో ఫలితాలు చూడొచ్చు.
ts-inter-Results-2016

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విడుదల చేయనున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి ఏ అశోక్ గురువారం తెలిపారు. మార్కులు/ గ్రేడింగ్ రూపంలో ఫలితాలు విడుదల చేయనున్నామని ఆయన చెప్పారు. విద్యార్థుల సౌకర్యార్థం పలు వెబ్‌సైట్‌లలో ఫలితాలు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ-సేవా లేదా టీఎస్/ ఏపీ ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చునని తెలిపారు. WWW.BIE.TELANGANA.CGG.GOV.IN అనే వెబ్‌సైట్‌లో ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు ఫలితాలు తెలుసుకోవచ్చునని చెప్పారు. అలాగే, ఇంటర్ ఫలితాలు RESULTS.NAMASTHETELANGAANA.COM, NTNIPUNA.COM, RESULTS.CGG.GOV.IN, EXAMRESULTS.TS.NIC.IN తోపాటు మరో 35 వెబ్‌సైట్లలో ఇంటర్మీడియట్ ఫలితాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మార్చి 2 నుంచి 21 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.