Friday, 18 January 2019

పోచారం ఆధ్వర్యంలో వ్యవసాయాభివృద్ధి: సీఎం కేసీఆర్


cmkcr-praises-speaker-pocharam-srinivas-reddy

తెలంగాణ శాసనసభ సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. స్పీకర్ గా పోచారం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆనందదాయకమైన విషయమన్నారు. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసిన కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.సభాపతి ఎన్నికను అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఒప్పుకోవడం హర్షణీయమన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అనేక మెట్లు అధిగమిస్తూ ఆరు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం హయాంలో తెలంగాణలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. పోచారం ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం చేసిన సమయాన్ని నేను మరిచిపోలేను. పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో మంచి పనులు జరిగాయి. రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించింది.

పోచారం కాలుమోపిన వేళా విశేషం బాగుంది..కాబట్టే వ్యవసాయంలో అద్భుత ఫలితాలు వచ్చాయని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతు బంధు పథకం లాంటి పథకాన్ని ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నరు. వ్యవసాయ రంగంలో రాష్ట్రం ఇంత అభివృద్ధి సాధించిందంటే ఆ ఘనత వ్యవసాయ శాఖ మంత్రిగా Read More

No comments:

Post a Comment