మహారాష్ట్రలో డ్యాన్స్ బార్ల పునఃప్రారంభానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. డ్యాన్స్ బార్ల లైసెన్సు విధానం, వాటి పనితీరుపై ఆంక్షలు విధిస్తూ 2016లో మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఓ చట్టంలోని కొన్ని నిబంధనలను రద్దు చేసిన సుప్రీంకోర్టు నిబంధనలు ఉండవచ్చు కానీ వాటిని అడ్డం పెట్టుకొని సంపూర్ణ నిషేధం విధించరాదు అని వ్యాఖ్యానించింది. డ్యాన్స్ బార్ల నిర్వహణకు లైసెన్సులు జారీ చేయాలని ఆదేశించిన న్యాయస్థానం వాటిని పాఠశాలలు, ప్రార్థనా స్థలాలకు కిలోమీటరు దూరంగా ఏర్పాటు చేయాలన్న నిబంధనను తోసిపుచ్చింది. జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఈ మేరకు తన తీర్పును ప్రకటిస్తూ, బార్లలో డ్యాన్స్ చేసే వారికి టిప్ (నగదు బహుమతి) ఇవ్వవచ్చు కానీ వారిపైకి నోట్లు లేదా చిల్లర విసర రాదని స్పష్టం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్ రూమ్‌లలో అసభ్య నృత్యాలపై నిషేధం, మహిళల గౌరవ (పని ప్రదేశాలలో) పరిరక్షణ మహారాష్ట్ర చట్టం, 2016 లోని పలు నిబంధనలను కోర్టు కొట్టివేసింది.
డ్యాన్స్ బార్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందని పేర్కొంటూ ఆ నిబంధనను కోర్టు రద్దు చేసింది. డ్యాన్స్ బార్లను సాయంత్రం ఆరు నుంచి రాత్రి 11.30 గంటల వరకే Read More
No comments:
Post a Comment