ముచ్చటగా మూడోవిడుత పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా సింహభాగం పల్లెలు గులాబీవర్ణాన్ని పులుముకొన్నాయి. మూడో విడుతలో బుధవారం 3506 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించగా, టీఆర్‌ఎస్ మద్దతుదారులు ఏకగ్రీవాలతో కలిపి 2742 పంచాయతీల్లో విజయబావుటా ఎగురవేశారు. వార్డుల్లోనూ గులాబీ జోరు కొనసాగింది. మొత్తం మూడు విడుతల్లో చూస్తే టీఆర్‌ఎస్ మద్దతుదారులు 8606 స్థానాల్లో విజయం సాధించారు. మూడో విడుతలో 4,116 పంచాయతీలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించగా.. 576 సర్పంచ్ స్థానాలు, 8956 వార్డులు ఏకగీవ్రమయ్యాయి. బుధవారం 3,506 పంచాయతీలకు, 36,729 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. మొదటి రెండు విడుతల స్థాయిలోనే మూడో విడుతలోనూ భారీ పోలింగ్ నమోదైంది.
Read More
No comments:
Post a Comment