సిడ్నీ: రన్ మెషీన్ విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ రికార్డుతో లెజెండరీ క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, కలిస్, లారాలను మించిపోయాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి కేవలం 23 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే అప్పటికే విరాట్ ఆ రికార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 19 వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. విరాట్ కేవలం 399 ఇన్నింగ్స్‌లోనే ఈ మైల్‌స్టోన్ అందుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ (432 ఇన్నింగ్స్), లారా (433), పాంటింగ్ (444), కలిస్ (458)లను అతడు అధిగమించాడు. 19 వేల పరుగుల మార్క్‌ను అతడు ఆస్ట్రేలియా గడ్డపై అందుకోగా.. అంతకుముందు 18 వేల పరుగులను ఇంగ్లండ్‌లో, 17 వేల పరుగులను సౌతాఫ్రికాలో సాధించడం విశేషం. ఈ మూడు మైల్‌స్టోన్స్‌ను కేవలం ఏడాది వ్యవధిలోనే అతడు అందుకున్నాడంటే కోహ్లి ఎంతటి ఫామ్‌లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ క్రికెట్‌లో 19 వేల పరుగులు చేసిన 12వ క్రికెటర్‌గా, భారత్ తరఫున సచిన్, ద్రవిడ్ తర్వాత మూడో బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలిచాడు... Readmore
No comments:
Post a Comment