Friday, 22 February 2019

ఎన్టీఆర్ మహానాయకుడు రివ్యూ


సంక్రాంతి కానుకగా గత నెలలో విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ సినీ ప్రయాణం ఎలాంటి మలుపులు లేకుండా సాఫీగా సాగడం, ఆసక్తికర అంశాలకు కథలో చోటివ్వకపోవడంతో ప్రేక్షకుల్ని ఈ చిత్రం మెప్పించలేకపోయింది. దాంతో రెండో భాగమైన ఎన్టీఆర్ మహానాయకుడును ఎలాంటి ప్రచారం, ఆర్భాటాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు చిత్రబృందం. ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఎన్నో ఎత్తుపల్లాల మధ్య సాగింది. అడుగడుగునా కుట్రలు, సవాళ్లు ఎదుర్కొన్నారు.
ముఖ్యంగా లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించిన అనంతరం రాజకీయపరంగా, వ్యక్తిగతంగా ఎన్టీఆర్‌కు ఎదురైన పరిణామాలతో పాటు వైస్రాయ్ ఘటన లాంటి అంశాలు సినిమాలో ఉంటాయా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది? సినిమాలో తనను విలన్‌గా చూపిస్తే సహించేది లేదంటూ నాదెండ్ల భాస్కర్‌రావు చిత్రబృందాన్ని హెచ్చరించడంతో ఈ సినిమాలో చర్చించే అంశాలేమిటో అనే ఆసక్తి తెలుగు ప్రేక్షకుల్లో నెలకొంది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రంలో వాస్తవాల్నిచూపించారా? చరిత్రను వక్రీకరించారా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్పిందే..  =====> Readmore Review

Tuesday, 5 February 2019

Telangana Tourist Places | Telangana Waterfalls | Kuntala waterfalls | Bogatha waterfalls



IF You are  a nature lover , #Telangana  State is home destination to many   beautiful and attractive waterfall  . visit  these in the right season, you can find here     best  #waterfalls  details and  information about   telangana waterfalls,  #telangana tourism  #telangaanam 

Friday, 1 February 2019

ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్న పీయూష్ గోయల్


piyush goyal arrives at ministry of finance office

కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. పీయూష్ గోయల్ ఆఫీసు ప్రాంగణంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, నిపుణులతో కలిసి అభివాదం చేశారు. పీయూష్ గోయల్ ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు బడ్జెట్ ప్రతులు కూడా పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకున్నాయి. కట్టుదిట్టమైన భద్రతల మధ్య బడ్జెట్ ప్రతులను పార్లమెంట్ కు Read More

ప్రజల ఆశలు, ఆకాంక్షల్ని నెరవేర్చాం.. ఇది నవభారతం


president-ramnath-kovind-address-to-the-members-of-both-the-houses-of-parliamen

నవ భారతాన్ని ఆవిష్కరించేందుకు నాలుగున్నరేండ్లుగా కేంద్రం కృషి చేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు సర్కారు పాటుపడిందని ప్రశంసలు కురిపించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గురువారం ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. జవాబుదారీతనం, పారదర్శకతను పెంచి.. అవినీతిరహిత పాలన దిశగా సర్కారు ముందడుగు వేసిందని కితాబునిచ్చారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య భద్రతా పథకమైన ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశంలో 50 కోట్ల మందికి ఆరోగ్య పరిరక్షణ కల్పించామని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నదని కొనియాడారు.

 కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. పీయూష్ గోయల్ ఆఫీసు ప్రాంగణంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, నిపుణులతో కలిసి అభివాదం చేశారు. పీయూష్ గోయల్ ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ ను Read More

Thursday, 31 January 2019

మోదీ నా కన్నా జూనియర్.. అయినా సర్ అని పిలిచాను!

 
Called PM Modi 'sir' to satisfy his ego Chandrababu Naidu

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా మరోసారి విమర్శలు గుప్పించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మోదీ రాజకీయాల్లో తనకన్నా జూనియర్ అయినా కూడా తాను సర్ అని పిలిచానని, కేవలం ఆయన అహాన్ని సంతృప్తి పరచడానికే తానిలా చేశానని బాబు అన్నారు. అఖిలపక్ష సమావేశంలో భాగంగా బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను కూడా నేను మిస్టర్ క్లింటన.. Read More

అమెజాన్‌ను ముంచిన యువకుడు అరెస్ట్‌


Man Arrested For Allegedly Duping Amazon Of Rs 30 Lakh In Indore

ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ను ఓ యువకుడు భారీగా మోసం చేశాడు. ఖరీదైన వస్తువులను ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసి రూ. 30 లక్షల మేర మోసం చేసినట్లు తేలింది. ఇండోర్‌కు చెందిన మహ్మద్‌ మహువాలా(27) ఫేక్‌ ఈమెయిల్‌ అకౌంట్స్‌, ఫోన్‌ నంబర్లతో పలు అకౌంట్లను క్రియేట్‌ చేసి ఖరీదైన గ్యాడ్జెట్స్‌, మొబైల్‌ ఫోన్స్‌ను కొనుగోలు చేశాడు. ఆ వస్తువులు తన వద్దకు వచ్చాక వాటిని తీసేసుకొని.. Read More

హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌లో 300 పైగా స్టాళ్లు అగ్నికి ఆహుతి



హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ఎగ్జిబిషన్ (నుమాయిష్)లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి 8.30 గంటలకు మొదలైన అగ్నికీలలు.. పదిన్నరవరకు కొనసాగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 200 స్టాళ్లు ఆహుతయ్యాయి. కోట్ల రూపాయల్లో ఆస్తినష్టం సంభవించింది. అగ్నిమాపకశాఖ, జీహెచ్‌ఎంసీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు సకాలంలో స్పందించి, పెను ముప్పును తప్పించాయి. నింగికి ఎగసిపడుతున్న మంటలను 20కిపైగా ఫైరింజన్లు శ్రమించి అర్పివేశాయి. దాదాపు 60 వాటర్‌ట్యాంకర్లు ఫైరింజన్లకు ఎప్పటికప్పుడు నీటిని సరఫరాచేశాయి. అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం, సందర్శకులను పోలీసులు సురక్షితంగా బయటకు పంపించడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే.. పొగ కారణంగా ఏడుగురు ఊపిరి ఆడక ఇబ్బందికి గురయ్యారు. వారిలో ముగ్గురిని నాంపల్లి కేర్ దవాఖానకు తరలించారని సమాచారం =====>  Readmore

న్యూజిలాండ్ ఖాతాలో హామిల్ట‌న్ వ‌న్డే


new-zealand-beat-india-by-eight-wickets-at-hamilton-odi

ఇండియాతో జ‌రిగిన నాలుగ‌వ వ‌న్డేలో న్యూజిలాండ్ ఈజీ విక్ట‌రీ న‌మోదు చేసింది. 93 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కివీస్ కేవ‌లం 14.4 ఓవ‌ర్ల‌లో చేజ్ చేసి 8 వికెట్ల తేడాతో నెగ్గింది. వాస్త‌వానికి వ‌న్డే సిరీస్‌ను భార‌త్ కైవ‌సం చేసుకున్నా.. కివీస్‌కు ఈ విజ‌యం కొంత ఊర‌ట‌నిచ్చింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో రాస్ టేల‌ర్ 37, నికోల‌స్ 30 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచారు. అయిద‌వ వ‌న్డే ఫిబ్ర‌వ‌రి 3వ తేదీన జ‌ర‌గ‌నున్న‌ది.

బెంబేలెత్తించిన బౌల్ట్..
ఉద‌యం ట్రెంట్ బౌల్ట్‌.. భార‌త్ బ్యాట్స్‌మెన్‌ను హ‌డ‌లెత్తించాడు. త‌న పేస్‌తో టాప్ ఆర్డ‌ర్‌ను ముప్పుతిప్ప‌లు పెట్టించాడు. స్వింగ్ అధికంగా ఉన్న సెడాన్ పార్క్‌లో.. Read More

రోజుకో గుడ్డు తింటే డ‌యాబెటిస్ రాద‌ట‌..!


Eating an egg a day may keep diabetes away

కోడిగుడ్డులో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే నిత్యం శ‌రీరానికి సంపూర్ణ పోష‌ణ అందాలంటే రోజుకో గుడ్డును తినాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే రోజుకో గుడ్డును తిన‌డం వ‌ల్ల పోష‌ణ అంద‌డం మాత్ర‌మే కాదు, డ‌యాబెటిస్ వచ్చే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌గా ఉంటాయ‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

నిత్యం ఒక కోడిగుడ్డును తిన‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ వ్యాధి రాకుండా చూసుకోవ‌చ్చ‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలోనే సైంటిస్టులు 239 మంది వ్య‌క్తుల‌ను 20 ఏళ్ల పాటు ప‌రిశీలించారు. రోజుకో గుడ్డు తినేవారిలో డయాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని, గుడ్డు తిన‌ని.. Read More

తెలంగాణ పథకాలు అద్భుతం


telangana schemes are awesome

రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని అఖిల భారత సివిల్ సర్వీసెస్ అధికారులు ప్రశంసించారు. ప్రభుత్వం ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నద న్నారు. శిక్షణ నిమిత్తం వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన అధికారులకు ఎంసీహెచ్చార్డీలో సుస్థిర అభివృద్ధికి కచ్చితమైన పథకాల అమలు, పర్యవేక్షణ అంశంపై ఐదురోజుల శిక్షణ ఇస్తు న్నారు. ఇందులోభాగంగా బుధవారం జలసౌధలో కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథపై పవర్‌పాయింట్‌ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాలు, సాంకేతిక వివరాలను ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ హరిరాం, మిషన్ కాకతీయపై మైన ర్ ఇరిగేషన్‌శాఖ చీఫ్ ఇంజినీర్ శ్యాంసుందర్, మిషన్ భగీరథపై Read More

7 కోట్ల ఇంటిని 13 కోట్లకు కొన్న స్టార్ హీరోయిన్


 aaliahome

 ఆలియా భట్.. స్టార్ డైరెక్టర్ మహేష్ భట్ కూతురిగానే కాకుండా హీరోయిన్‌గానూ తనకంటూ ఓ సొంత ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. గ్లామరస్ రోల్స్‌లోనే కాకుండా ఉడ్తా పంజాబ్‌లాంటి మూవీలో పూర్తి డీగ్లామరస్ రోల్‌లోనూ అదరగొట్టింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. ఫలితం కోట్ల కొద్దీ డబ్బు. దీంతో ఎక్కడికక్కడ ప్రాపర్టీలను కొనే పనిలో ఉంది. ముంబైలోని పోష్ ఏరియా అయిన జుహులో ఇప్పటికే రెండు ఫ్లాట్లను కొన్న ఆలియా.. తాజాగా మరో 2300 చదరపు అడుగులు ఉన్న అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. అయితే Read More

గులాబీ ప్రభంజనం


TRS-Won

ముచ్చటగా మూడోవిడుత పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా సింహభాగం పల్లెలు గులాబీవర్ణాన్ని పులుముకొన్నాయి. మూడో విడుతలో బుధవారం 3506 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించగా, టీఆర్‌ఎస్ మద్దతుదారులు ఏకగ్రీవాలతో కలిపి 2742 పంచాయతీల్లో విజయబావుటా ఎగురవేశారు. వార్డుల్లోనూ గులాబీ జోరు కొనసాగింది. మొత్తం మూడు విడుతల్లో చూస్తే టీఆర్‌ఎస్ మద్దతుదారులు 8606 స్థానాల్లో విజయం సాధించారు. మూడో విడుతలో 4,116 పంచాయతీలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించగా.. 576 సర్పంచ్ స్థానాలు, 8956 వార్డులు ఏకగీవ్రమయ్యాయి. బుధవారం 3,506 పంచాయతీలకు, 36,729 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. మొదటి రెండు విడుతల స్థాయిలోనే మూడో విడుతలోనూ భారీ పోలింగ్ నమోదైంది.
Read More

Friday, 18 January 2019

Supreme Court okays liquor in dance bars


మహారాష్ట్రలో డ్యాన్స్ బార్ల పునఃప్రారంభానికి సుప్రీంకోర్టు  మార్గం సుగమం చేసింది. డ్యాన్స్ బార్ల లైసెన్సు విధానం, వాటి పనితీరుపై ఆంక్షలు విధిస్తూ 2016లో మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఓ చట్టంలోని కొన్ని నిబంధనలను రద్దు చేసిన సుప్రీంకోర్టు నిబంధనలు ఉండవచ్చు కానీ వాటిని అడ్డం పెట్టుకొని సంపూర్ణ నిషేధం విధించరాదు అని వ్యాఖ్యానించింది. డ్యాన్స్ బార్ల నిర్వహణకు లైసెన్సులు జారీ చేయాలని ఆదేశించిన న్యాయస్థానం వాటిని పాఠశాలలు, ప్రార్థనా స్థలాలకు కిలోమీటరు దూరంగా ఏర్పాటు చేయాలన్న నిబంధనను తోసిపుచ్చింది. జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఈ మేరకు తన తీర్పును ప్రకటిస్తూ, బార్లలో డ్యాన్స్ చేసే వారికి టిప్ (నగదు బహుమతి) ఇవ్వవచ్చు కానీ వారిపైకి నోట్లు లేదా చిల్లర విసర రాదని స్పష్టం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్ రూమ్‌లలో అసభ్య నృత్యాలపై నిషేధం, మహిళల గౌరవ (పని ప్రదేశాలలో) పరిరక్షణ మహారాష్ట్ర చట్టం, 2016 లోని పలు నిబంధనలను కోర్టు కొట్టివేసింది.

డ్యాన్స్ బార్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందని పేర్కొంటూ ఆ నిబంధనను కోర్టు రద్దు చేసింది. డ్యాన్స్ బార్లను సాయంత్రం ఆరు నుంచి రాత్రి 11.30 గంటల వరకే Read More 

రోహిత్ శర్మ 10 ఇయర్ చాలెంజ్ మెసేజ్ చూశారా?

Rohit-sharma-10-years-challenge

10 ఇయర్ చాలెంజ్.. తాజాగా సోషల్ మీడియాను ఊపేస్తున్న కొత్త చాలెంజ్ ఇది. సెలబ్రిటీలు వరుసగా ఒకరి తర్వాత మరొకరు ఈ చాలెంజ్‌కు సై అంటున్నారు. ఈ చాలెంజ్ అంటే ఏమీ లేదు.. పదేళ్ల కిందట ఎలా ఉండేవాళ్లు.. ఇప్పుడెలా ఉన్నారు.. ఈ రెండు ఫొటోలూ సోషల్ మీడియాలో షేర్ చేస్తే చాలు. ఇప్పటికే ఐసీసీ సహా ఎంతో మంది క్రికెటర్లు కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించారు. అయితే టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 10 ఇయర్ చాలెంజ్ మాత్రం Read More 

పోచారం ఆధ్వర్యంలో వ్యవసాయాభివృద్ధి: సీఎం కేసీఆర్


cmkcr-praises-speaker-pocharam-srinivas-reddy

తెలంగాణ శాసనసభ సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. స్పీకర్ గా పోచారం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆనందదాయకమైన విషయమన్నారు. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసిన కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.సభాపతి ఎన్నికను అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఒప్పుకోవడం హర్షణీయమన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అనేక మెట్లు అధిగమిస్తూ ఆరు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం హయాంలో తెలంగాణలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. పోచారం ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం చేసిన సమయాన్ని నేను మరిచిపోలేను. పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో మంచి పనులు జరిగాయి. రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించింది.

పోచారం కాలుమోపిన వేళా విశేషం బాగుంది..కాబట్టే వ్యవసాయంలో అద్భుత ఫలితాలు వచ్చాయని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతు బంధు పథకం లాంటి పథకాన్ని ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నరు. వ్యవసాయ రంగంలో రాష్ట్రం ఇంత అభివృద్ధి సాధించిందంటే ఆ ఘనత వ్యవసాయ శాఖ మంత్రిగా Read More

Thursday, 3 January 2019

కోహ్లి మరో అరుదైన రికార్డు

 sportsnews
సిడ్నీ: రన్ మెషీన్ విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ రికార్డుతో లెజెండరీ క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, కలిస్, లారాలను మించిపోయాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి కేవలం 23 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే అప్పటికే విరాట్ ఆ రికార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 19 వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. విరాట్ కేవలం 399 ఇన్నింగ్స్‌లోనే ఈ మైల్‌స్టోన్ అందుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ (432 ఇన్నింగ్స్), లారా (433), పాంటింగ్ (444), కలిస్ (458)లను అతడు అధిగమించాడు. 19 వేల పరుగుల మార్క్‌ను అతడు ఆస్ట్రేలియా గడ్డపై అందుకోగా.. అంతకుముందు 18 వేల పరుగులను ఇంగ్లండ్‌లో, 17 వేల పరుగులను సౌతాఫ్రికాలో సాధించడం విశేషం. ఈ మూడు మైల్‌స్టోన్స్‌ను కేవలం ఏడాది వ్యవధిలోనే అతడు అందుకున్నాడంటే కోహ్లి ఎంతటి ఫామ్‌లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ క్రికెట్‌లో 19 వేల పరుగులు చేసిన 12వ క్రికెటర్‌గా, భారత్ తరఫున సచిన్, ద్రవిడ్ తర్వాత మూడో బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలిచాడు... Readmore

క్యూబా విప్లవానికి 60 ఏండ్లు

 telugu news
హవానా, జనవరి 2: క్యూబా విప్లవానికి మంగళవారంతో 60 ఏండ్లు పూర్తయ్యాయి. దీంతో ఆ దేశం ఘనంగా వేడుకలను నిర్వహించింది. కాస్ట్రోయేతరుల పాలనలో వేడుకలు నిర్వహిస్తుండడం ఇదే మొదటిసారి. క్రేడిల్ ఆఫ్ ది రెవల్యూషన్‌గా పిలిచే శాంటియాగో డి క్యూబాలో సంస్మరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి రౌల్ కాస్ట్రో హాజరయ్యారు. దేశ వీరులు జోస్ మార్టీ, ఫిడెల్ క్యాస్ట్రో సమాధుల వద్ద ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గతేడాది ఏప్రిల్‌లో దేశాధ్యక్షుడిగా మిగ్వెల్ డియాజ్ కానెల్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అమెరికా మద్దతుతో పాలన సాగించిన నియంత బటిస్టా.. విప్లవం నేపథ్యంలో 1958 డిసెంబర్ 31న దేశాన్ని విడిచి పారిపోయారు. దీంతో 1959 జనవరి 1న ఫిడెల్ కాస్ట్రో దేశంలో ఏకపార్టీ కమ్యూనిస్టు పాలనకు నాందిపలికారు. ...Readmore 

పుజారా సూప‌ర్ ఫామ్‌.. టెస్టుల్లో 18వ‌ సెంచ‌రీ

ఆస్ట్రేలియా టూర్‌లో పుజారా అద్భుత ఫామ్ కొన‌సాగుతోంది. నాలుగ‌వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ చ‌తేశ్వ‌ర్ పుజారా సెంచ‌రీ చేశాడు. ఇవాళ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌కు పుజారా గ‌ట్టి పునాది వేశారు. 199 బంతుల్లో సెంచ‌రీ చేసిన పుజారా.. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌ను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఈ సిరీస్‌లో అత‌నికి ఇది మూడ‌వ సెంచ‌రీ కాగా, మొత్తం టెస్టుల్లో అతనికి ఇది 18వ సెంచ‌రీ కావ‌డం విశేషం. పుజారా సెంచ‌రీలో మొత్తం 13 ఫోర్లు ఉన్నాయి  ...Readmore