Wednesday, 10 September 2014

KCR Completes 100 days As Telangana CM

జెట్‌స్పీడ్‌లో కేసీఆర్ ఎక్స్‌ప్రెస్ ,మన ప్రభుత్వానికి రేపటితో సెంచరీ-బంగారు తెలంగాణకు భరోసా.. -అడుగడుగునా తెలంగాణ ముద్ర -ప్రతి పథకంలోనూ కొత్త పంథా.. -చరిత్ర సృష్టించిన సామాజిక సర్వే-దేశాన్ని ఆకర్షించిన దళితులకు భూపంపిణీ..- ప్రజలు మెచ్చిన గోల్కొండ ఉత్సవాలు-వినూత్న పంథాలో సాగుతున్న కేసీఆర్ పాలన

సకలజన ఆమోదం పొందుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం,అస్తిత్వం.. అభివృద్ధి.. ఆధునికత.. ఆత్మగౌరవం..! ఇవీ ఆరు దశాబ్దాల వలసపాలకుల పద ఘట్టనలకింద తెలంగాణ కోల్పోయినవి! వాటికి తోడు యథేచ్చగా వనరుల దోపిడీ.. సకల రంగాల్లో వివక్షతో తెలంగాణ కునారిల్లిపోయింది! చరిత్ర వక్రీకరణకు గురైంది! యాస భాషలు వెక్కిరింతలు చవిచూశాయి! సమాజం నిలువెల్లా గాయపడింది! ఆ గాయాలు బాధలను స్రవిస్తుండగానే ప్రాణాలు ఉగ్గబట్టి.. దశాబ్దాలపాటు పోరుపథాన నడిచి.. ప్రజాస్వామ్యయుతంగా సొంత రాష్ర్టాన్ని సాధించుకుంది!
ఇప్పుడు ఆ పోరాటం పాలనగా మార్పు చెందింది! ప్రజలకు కావాల్సినవి ఇవీ.. అంటూ ఎవరైతే కొట్లాడారో.. వారే ఇప్పుడు పాలకులు! అందుకే సబ్బండవర్ణాలకు మేలు చేసే నిర్ణయాలు! అది ఒక సంస్థకు తెలంగాణ జాతి పిత జయశంకర్‌సారు పేరు పెట్టుకున్నా.. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరాల సరసన నిలిపేందుకు ప్రతినబూనినా.. అందులో తెలంగాణ ప్రగతిబాటన నడువాలనే తపన! ఒకప్పుడు ప్రపంచ స్థాయి పారిశ్రామిక నగరమైన హైదరాబాద్‌కు తిరిగి నాటి వైభవం కల్పించేందుకు ఆతృత! ఇకనైనా తెలంగాణవాసి బతుకు బాగుపడాలనే ఆశ! ఆ ఆశకు అంకురం.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం! ఆ ఆశకు అడ్డుపడేవారి పాలిటి అంకుశం ఆ ప్రభుత్వానికి నేతృత్వం వహించే కేసీఆర్.............. Read More 

No comments:

Post a Comment