![]() |
malik |
-రిమోట్ ఎప్పుడూ సానియా చేతుల్లోనే
-టీనేజర్‌గా ప్రేమలోపడ్డానన్న షోయబ్
ఇద్దరూ కలిసి టీవీ చూస్తారన్నమాటేగానీ, ఆవిడకు నచ్చిన ఛానలే చూడాలి.. ఎందుకంటే టీవీ రిమోట్ ఎప్పుడూ తన చేతుల్లోనే. పాపం.. అతడు ప్రేక్షకుడే! తను గొడవను ఆరంభిస్తే, ఇతగాడు ఓపిగ్గా భరించాలి.. ముగించాలి! పాపం..భర్తగా మారిన తర్వాత షోయబ్ మాలిక్‌కు సానియా నుంచి ఎన్ని సమస్యలో కదా? భార్య సానియా ప్రపంచ టెన్నిస్ డబుల్స్‌లో నంబర్‌వన్‌గా అవతరించడంపై ఆనందం వ్యక్తం చేసిన మాలిక్.. సామాజిక వెబ్‌సైట్‌లో అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు వెల్లడించాడు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడం వల్ల సానియాను కలవలేకపోతున్నానన్న మాలిక్, ఈద్ తర్వాత పాక్‌లోనే కలుస్తానన్నాడు. ఇక జూనియర్ మాలిక్ ఎప్పుడు? అనడిగితే, త్వరలోనేనంటూ ముసిముసిగా నవ్వాడు. తమకు ఆడపిల్ల పుడితే మిరిల్లా లేదంటే రీమ్ అనే పేరు పెడతామన్నాడు...malik , sania, love story,Sports News